మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 16:35:15

సురేంద‌ర్ రెడ్డి సినిమాలో ర‌ష్మిక‌.!

సురేంద‌ర్ రెడ్డి సినిమాలో ర‌ష్మిక‌.!

అక్కినేని అఖిల్‌-డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే  ఈ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని నిర్మించిన‌ అనిల్‌ సుంక‌ర ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఈ చిత్రంలో ర‌ష్మిక‌నే హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంద‌ని ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్ అయిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. 

స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా  రాను్న ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ‌, స్క్రీన్ ప్లే నందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. అఖిల్-పూజా హెగ్గే కాంబినేష‌న్ లో వ‌స్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు న‌టించిన చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద పరాజ‌యాన్ని చ‌విచూడ‌టంతో ఈ సినిమాతోనైనా త‌న‌కు క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడు అఖిల్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo