ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 17:56:37

రియా చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో ర‌చితారామ్..!‌

రియా చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో ర‌చితారామ్..!‌

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేశ్ హీరోగా సూప‌ర్ మ‌చ్చి చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. క‌ళ్యాణ్ దేవ్ కు జోడీగా ర‌చితారామ్ న‌టిస్తోంది. అయితే తొలుత ఈ సినిమాలో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని హీరోయిన్ గా అనుకుంద‌ట చిత్ర‌యూనిట్. అంతేకాదు రియా, క‌ళ్యాణ్ దేవ్ ల మ‌ధ్య ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసింద‌ట‌. కానీ సుశాంత్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా కుటుంబ‌స‌భ్యుల‌పై కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.

రియా చుట్టూ విచార‌ణ‌ల పేరుతో రోజురోజుకీ ఉచ్చు బిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో రియా స్థానంలో ర‌చితారామ్ ను ఎంపిక చేసి కాస్త ఉప‌శ‌మ‌నం పొందార‌ట నిర్మాత‌లు. రియాతో తీసిన స‌న్నివేశాల‌ను పూర్తిగా తొల‌గించి చిత్రీక‌ర‌ణ కొన‌సాగించారు. సూప‌ర్ మచ్చి సినిమా త్వర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo