శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 20:00:29

' మిస్ ఇండియా' థీమ్ లిరిక‌ల్ వీడియో సాంగ్

' మిస్ ఇండియా' థీమ్ లిరిక‌ల్ వీడియో సాంగ్

మహాన‌టి చిత్రంలో త‌న అస‌మాన న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది కోలీవుడ్ తార కీర్తిసురేశ్. ఈ హీరోయిన్ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న చిత్రం ' మిస్ ఇండియా' . ఈ చిత్రానికి న‌రేంద్ర‌నాథ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ  ప్రాజెక్టు నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన మా ల‌చ్చా గుమ్మ‌డి రా పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. తాజాగా చిత్ర‌యూనిట్ మిస్ ఇండియా థీమ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ ను విడుద‌ల చేసింది. 

' ప్ర‌తి ఉద‌యం సిద్ద‌మే కదా..ఉద‌యానికి వేదికై స‌దా..ఇది గ‌మ‌నం చేర‌లేవుగా..గ‌మ్యానికి గాలివాటుగా.. ' అంటూ వచ్చే పాట ఆక‌ట్టుకునే బాణీల‌తో సాగుతుంది. ‌క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి రాసిన లిరిక్స్ కు హారిక నారాయ‌ణ‌, శృతిరంజ‌నీ గొంతు క‌లిపారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ థ‌మ‌న్ అందించిన బాణీలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌హేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.