మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 17:30:38

కీర్తిసురేశ్ జాయ్ ఫుల్ డ్యాన్స్..ఫొటో వైర‌ల్‌

కీర్తిసురేశ్ జాయ్ ఫుల్ డ్యాన్స్..ఫొటో వైర‌ల్‌

టాలీవుడ్ బ్యూటీ కీర్తిసురేశ్ ప్ర‌స్తుతం స‌ఖి సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో తెర‌కెక్కుతుంది. ఆగ‌స్టు 15న ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ మూవీ లొకేష‌న్ నుంచి కీర్తిసురేశ్ గ్రామీణ ప్రాంతంలో నివ‌సించే సాధార‌ణ యువ‌తి గెట‌ప్‌లో సంతోషంలో డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూస్తే కీర్తిసురేవ్ మేక‌ప్ లేకుండా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. 

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోన్న ఈ మూవీలో కీర్తిసురేశ్ షూట‌ర్ గా క‌నిపించ‌నుంది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్నారు. కొన్ని సీన్లు మిన‌హా దాదాపు సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్టు టాక్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo