మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Aug 16, 2020 , 20:15:44

గుడ్ ల‌క్ స‌ఖి టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న

గుడ్ ల‌క్ స‌ఖి టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న

కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం గుడ్ ల‌క్ స‌ఖి. ఈ టీజ‌ర్ కు అద్బుత‌మైన స్పంద‌న వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ టీజ‌ర్ వినోదాత్మక సాగుతూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతుంది. 

ఓ పల్లెటూరిలో  పుట్టిన గిరిజన యువతి ఎన్నో అవరోధాల్ని దాటుకొని జాతీయస్థాయిలో షూటర్‌గా ఎలా ఎదిగింది? షూటర్ గా ఎదిగే క్ర‌మంలో ఆ యువ‌తి ఎదుర్కొన్న అనుభవాలేమిటి?  అనే ఇతివృత్తంతో  సాగే ఈ చిత్రానికి నగేష్‌ కుకునూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌కు షూటింగ్‌ శిక్షకుడిగా జగపతిబాబు కనిపిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo