మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 15:33:00

ఆట‌కు సై అంటోన్న క‌త్రినాకైఫ్‌..ఫొటో చ‌క్క‌ర్లు

ఆట‌కు సై అంటోన్న క‌త్రినాకైఫ్‌..ఫొటో చ‌క్క‌ర్లు

మీర్జాపూర్ యువ‌రాణి మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో న‌టించిన క‌త్రినాకైఫ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. త‌న అందం, అభిన‌యంతో అంద‌రి మ‌న‌సులు దోచేసిన‌ క‌త్రినా.. ప్ర‌స్తుతం హిందీ సినిమాల‌తో బిజీగా మారిపోయింది. ఈ అమ్మ‌డికి సినిమా కాకుండా ఇష్ట‌మైన ప‌ని ఏంటో తెలుసా..? చాలా మందికి ఇష్ట‌మైన ఆటే..అదేనండి క్రికెట్. అవును క‌త్రినాకైఫ్ క్రికెట్ ఆట‌ను చాలా మిస్స‌వుతున్నట్టు అర్జున్ క‌పూర్ తో చెప్పింది. క్రికెట్ బ్యాట్, బంతి పట్టుకున్న త్రోబ్యాక్ స్టిల్ ను క‌త్రినా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

క్రికెట్ ను మిస్స‌వుతున్నా..క్రికెట్ ఆడేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటా...ఇన్ స్టాగ్రామ్ లో క‌త్రినాకైఫ్  క్యాప్ష‌న్ ఇచ్చింది. రెడ్‌, బ్లూ కల‌ర్డ్ స‌ల్వార్ క‌మీజ్ లో చేతిలో బ్యాట్‌, బాల్ ప‌ట్టుకున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo