మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 19:29:37

మురుగదాస్‌ సినిమాలో కాజల్‌..!

మురుగదాస్‌ సినిమాలో కాజల్‌..!

కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి-కొరటాల కాంబినేషన్‌ లో వస్తోన్న ఆచార్య చిత్రంతోపాటు ముంబై సాగా అనే హిందీ మూవీలో నటిస్తోంది. కాజల్‌ కొత్త సినిమాకు సంబంధించిన మరో వార్త ఇపుడు ఫిలింనగర్‌ లో చక్కర్లు కొడుతోంది. మురుగదాస్‌ డైరెక్షన్‌ లో విజయ్‌ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజల్‌ అగర్వాల్‌ దాదాపు ఖాయమైనట్టేనని టాక్‌ వినిపిస్తోంది. కాజల్‌తో సంప్రదింపుల ప్రక్రియ తుది దశలో ఉందట. త్వరలోనే కాజల్‌ ఎంపికపై ప్రకటన వెలువడనుంది.

కమల్‌హాసన్‌-శంకర్‌ కాంబోలో ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న ప్రాజెక్టు ఇండియన్‌ 2. ఈ ప్రాజెక్టులో కూడా కాజల్‌ హీరోయిన్‌ కాగా..క్రేన్‌ ప్రమాదం, కరోనా ఎఫెక్ట్‌ తో ఈ మూవీ షూటింగ్‌ అటకెక్కింది. మళ్లీ తిరిగి ఎప్పుడు షూటింగ్‌ షురూ చేస్తారనేది తెలియదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo