మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 17:06:49

హ్యాపీ బ‌ర్త్ డే టు హ‌న్సికా..ఫొటోలు చ‌క్క‌ర్లు

హ్యాపీ బ‌ర్త్ డే టు హ‌న్సికా..ఫొటోలు చ‌క్క‌ర్లు

హైద‌రాబాద్‌: దేశ‌ముదురు సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది అందాల భామ హ‌న్సికా మోత్వానీ. ప‌దిహేనేళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా క‌నిపించినీ ఈ బ్యూటీ ఉత్త‌మ‌న‌టిగా అవార్డు అందుకుంది. ముంబై భామ నేటితో 29వ ప‌డిలోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా హ‌న్సికకు కోస్టార్స్, స్నేహితులు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసి అంద‌రినీ అల‌రించింది.

గతేడాది సందీప్ కిష‌న్ తో క‌లిసి తెనాలి రామ‌కృష్ణ సినిమాలో మెరిసిన హ‌న్సికా ప్ర‌స్తుతం రెండు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ‌క్వారంటైన్ టైంలో త్రోబ్యాక్ వెకేష‌న్ ఫొటోలు, సెల్ఫీలు షేర్ చేసిన విష‌యం తెలిసిందే. కాజ‌ల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.