మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 17:13:55

అనన్యపాండే స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే

అనన్యపాండే  స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే

ముంబై: స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2 చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్యపాండే. ఈ చిత్రానికిగాను ఉత్తమనటిగా ఫిలింఫేర్‌ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ భామ స్లిట్‌ గౌన్‌తో కలర్డ్‌ గాగుల్స్‌తో ైస్టెల్‌గా ఉన్న ఫొటో ఇపుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. బ్లాక్‌ డ్రెస్సులో సముద్రతీరంలో ైస్టెల్‌గా నవ్వుతూ అందరి మనసులు దోచేస్తున్న ఈ త్రోబ్యాక్‌స్టిల్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ షూటింగ్‌ను రద్దు చేసుకున్నారు. విజయ్‌దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకులను అలరించనుంది ఫైటర్‌. ఇప్పటికే ఈ సినిమా లొకేషన్‌లో పూరీ, విజయ్‌, అనన్యపాండే దిగిన కొన్ని స్టిల్స్‌ నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo