మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 17:29:13

ఒకే కాస్ట్యూమ్స్‌లో కైరా, పూజా హెగ్డే

ఒకే కాస్ట్యూమ్స్‌లో కైరా, పూజా హెగ్డే

పూజా హెగ్డే, కైరా అద్వానీ..ఈ ఇద్దరు హీరోయిన్లు హిందీ తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ  మంచి ఫాంలో ఉన్నారు. తెలుగులో భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన కైరా అద్వానీ..ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ తో కలిసి లక్ష్మీబాంబ్‌ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు మరో మూడు హిందీ సినిమాలు కైరా చేతిలో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది అల వైకుంఠపురంలో చిత్రంతో మంచి హిట్‌ అందుకుంది పూజాహెగ్డే. ఈ భామ అఖిల్‌తో కలిసి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో నటిస్తోంది. హిందీలో సల్మాన్‌ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ ఇద్దరు బ్యూటీలు దాదాపు ఒకే రకమైన కాస్ట్యూమ్స్‌ లో కనిపిస్తోన్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రెడ్‌ లెహంగాలో పూజా, కైరా తళుక్కుమని మెరుస్తోన్న త్రోబ్యాక్‌ స్టిల్స్‌ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండింటిలో ఏ రెడ్‌ లెహెంగా బాగుందో చెప్పలేకపోతున్నారు నెటిజన్లు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo