ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 19:57:17

బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..డీఎస్పీ మ్యూజిక్ డైరెక్ట‌ర్

బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..డీఎస్పీ మ్యూజిక్ డైరెక్ట‌ర్

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ డ‌మ్ సంపాదించింది షాలినీ పాండే. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో క‌నిపించిన ఈ భామ ఇపుడు క్రేజీ ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశం కొట్టేసింది. బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ లో వ‌స్తున్న జ‌యేశ్ భాయ్ జోర్దార్ లో షాలిని పాండే హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. య‌శ్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ పై ఆదిత్యా చోప్రా, మ‌నీశ్ శ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ మూవీని ఇప్ప‌టికే ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసిన నిర్మాత‌లు..తాజాగా మ‌న‌సు మార్చుకున్న‌ట్టు బీటౌన్ టాక్‌.

థియేట‌ర్లు రీఓపెన్ అయిన త‌ర్వాత సినిమాను విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. లాక్ డౌన్ కు ముందే సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. కొత్త డైరెక్ట‌ర్ దివ్యాంగ్ త‌క్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తుండ‌టం విశేషం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo