శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 22:34:58

బిగ్‌బాస్‌కు నో చెప్పిన టాలీవుడ్‌ భామ

బిగ్‌బాస్‌కు నో చెప్పిన టాలీవుడ్‌ భామ

హైదరాబాద్‌ : తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ షో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆధారణను సొంతం చేసుకుంది. ఇప్పటికే మూడు సీజన్లు ముగించుకొని నాల్గో సీజన్‌ ప్రారంభానికి రెడీ  అయ్యింది. మొదటి సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని,  మూడు, నాలుగో సీజన్లకు నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. తాజాగా బిగ్‌బాస్‌-4 త్వరలో అంటూ నిర్వాహకులు ప్రొమో రిలీజ్‌ చేశారు. ఇప్పటికే ప్రోమోలను అన్నపూర్ణ స్లూడియోలో చిత్రీకరించారు. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. కాగా, షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

నాల్గో సీజన్‌లో పాల్గొనేది వీరేనంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ తరుణ్‌, హాట్‌ బ్యూటీ శ్రద్ధాదాస్‌, హంసానందితో పాటు పలువురి పేర్లు ప్రచారం కాగా తరుణ్‌, శ్రద్ధాదాస్‌ తాము పాల్గొనడం లేదని ధ్రువీకరించారు.  తాజాగా ఈ షో నిర్వాహకులు టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ పూనమ్ కౌర్ సంప్రదించారట. అయితే చాలా సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె వాటికంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో పూనమ్‌ అయితే బాగుంటుందని, నిర్వాహకులు ఆలోచించి సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌కు ఆమె తిరస్కరించినట్లు సమాచారం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo