గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 15:09:02

వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయ‌ట‌..!

వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయ‌ట‌..!

2019లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బిగిల్ చిత్రంలో గాయ‌త్రి పాత్ర‌లో క‌నిపించి..ఈ ఏడాది స‌మంత-శ‌ర్వానంద్ కాంబోలో వ‌చ్చిన జాను చిత్రంలో ట్రైనీ ఫొటోగ్రాఫ‌ర్ గా సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది క‌న్నడ భామ వ‌ర్ష బొల్ల‌మ్మ‌. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా చూసీ చూడంగానే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవ‌లే రిలీజైన మిడిల్‌క్లాస్ మెలోడీస్ సినిమా వ‌ర్ష‌కు మంచి బ్రేక్ నిచ్చింది. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందుతుంది.

ఈ సినిమా అందించిన విజ‌యంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌ర్ష ముందు క్యూ క‌డుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ రాజ్ త‌రుణ్ హీరోగా న‌టిస్తోన్న స్టాండ్ అప్ రాహుల్ మూవీలో యాక్ట్‌చేస్తోంది. దీంతోపాటు మ‌రికొన్ని చిత్రాల‌కు కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వర్గాల టాక్‌. రానున్న కాలంలో వ‌ర్ష మ‌రిన్ని సినిమాల్లో క‌నిపించ‌నుంద‌న్న‌మాట‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo