మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 16:48:33

2 ద‌శాబ్దాల ప్ర‌యాణం..గుర్తు చేసుకున్న త్రిష‌

2 ద‌శాబ్దాల ప్ర‌యాణం..గుర్తు చేసుకున్న త్రిష‌

1999లో సిమ్ర‌న్, ప్ర‌శాంత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జోడీ చిత్రంతో  సిల్వ‌ర్ స్ర్కీన్ పై మెరిసింది త్రిష‌. ఈ చిత్రంలో హీరోయిన్  స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది.  ఇదే సంవ‌త్స‌రంలో త్రిష మిస్ చెన్నై-1999 కిరీటాన్ని ద‌క్కించుకుంది. స‌రిగ్గా ఇదే రోజు (1999-సెప్టెంబ‌ర్ 30న) 16 ఏండ్ల ప్రాయంలోనే  త్రిష మిస్ చెన్నై కిరీటాన్ని అందుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న జీవితంలో మ‌రిచిపోలేని ఆనాటి మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంది త్రిష‌. మిస్ చెన్నై కిరీటం అందుకున్నప్ప‌టి ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ తేదీ..నా జీవితంలో మార్పు వ‌చ్చిన రోజు అంటూ..ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది త్రిష‌.

2002లో సూర్య‌తో క‌లిసి తొలిసారి హీరోయిన్ గా క‌నిపించింది. ఆ త‌ర్వాత తెలుగులో ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించిన వ‌ర్షం సినిమా ఇండ‌స్ట్రీలో రికార్డుల‌ను సృష్టించింది. ఈ మూవీ త‌ర్వాత త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ త‌న కెరీర్ లో మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ప్ర‌స్తుతం ఈ భామ 6 అప్ క‌మింగ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. 


View this post on Instagram

30/09/1999???? The day my life changed...❤️ #MissChennai1999

A post shared by Trish (@trishakrishnan) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo