గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 16:04:36

ఆచార్య ప్రాజెక్టు గురించి చెప్పిన‌ త్రిష‌..!

ఆచార్య ప్రాజెక్టు గురించి చెప్పిన‌ త్రిష‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య చిత్రంలో మొద‌ట హీరోయిన్ గా మేక‌ర్స్ త్రిష‌ను అనుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత చిరు ప్రాజెక్టులో త్రిష న‌టించ‌డం లేద‌ని తెలిసింది. దీనిపై ర‌క‌ర‌కాల వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి. త్రిష‌ను మేక‌ర్సే ప‌క్క‌న పెట్టారా..? లేదా త్రిష‌నే ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుందా..? అని ఊహాగానాలు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే దీనిపై తాజాగా త్రిష క్లారిటీ ఇచ్చింది. 

కొన్నిసార్లు ఊహించిన‌ట్టుగా జ‌రుగ‌క‌పోవ‌చ్చు. కొన్ని సృజ‌నాత్మ‌క విభేదాల వ‌ల్ల తాను చిరంజీవి సినిమాలో న‌టించ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. అయితే ఆచార్య చిత్ర‌బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది త్రిష‌. త్వ‌ర‌లోనే ఓ మంచి చిత్రంతో తాను ప్రేక్ష‌కులను  ప‌లుక‌రిస్తాన‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఈ బ్యూటీ 2016లో వ‌చ్చిన నాయ‌కి ప్రాజెక్టులో చివ‌రిసారిగా న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రే చిత్రం చేయ‌లేదు. ఆచార్య చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo