మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 15, 2020 , 18:24:17

సెలూన్ వ‌ద్ద ప్ర‌త్యక్ష‌మైన మిల్కీ బ్యూటీ..ఫొటోలు చ‌క్క‌ర్లు

సెలూన్ వ‌ద్ద ప్ర‌త్యక్ష‌మైన మిల్కీ బ్యూటీ..ఫొటోలు చ‌క్క‌ర్లు

స‌‌త్య‌దేవ్‌, త‌మ‌న్నా కాంబోలో వ‌స్తున్న గుర్తుందా సీతాకాలం సినిమా షూటింగ్ ఇటీవ‌లే గ్రాండ్ గా లాంఛ్ అయిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన మిల్కీ బ్యూటీ ఈ చిత్రం కోసం హైద‌రాబాద్ కు వచ్చింది. అయితే ఈ భామ స‌డెన్ గా మ‌ళ్లీ ముంబైలో ప్ర‌త్యక్ష‌మైంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్స్ అంతంత మాత్ర‌మే ఉండ‌టంతో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటుంది తమ‌న్నా. ఫేస్ మాస్క్ పెట్టుకుని షార్ట్, టీష‌ర్ట్ వేర్‌లో ఉన్న త‌మ‌న్నా ముంబైలోని ఓ సెలూన్ కు వెళ్లింది. మిల్కీ బ్యూటీ ఆఫ్ డ్యూటీ లుక్ లో సెలూన్ వ‌ద్ద కెమెరాకు పోజిచ్చిన స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

త‌న త‌ల్లిదండ్రుల‌కు  కరోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన త‌ర్వాత త‌మ‌న్నా బ‌య‌ట క‌నిపించ‌డం ఇదే తొలిసారి. అయితే కరోనా ప‌రీక్ష‌ల్లో త‌మ‌న్నాతోపాటు సిబ్బందికి నెగెటివ్ అని వ‌చ్చింది.   


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo