శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 15:22:28

పొట్టి డ్రెస్ లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్

పొట్టి డ్రెస్ లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ చాలా మంది ఫాలో‌వర్ల‌ను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. లాక్ డౌన్ టైంలో ఇంటిప‌ట్టునే ఉండి యోగాస‌నాలు వేస్తూ త‌న ఫాలోవ‌ర్ల‌కు టిప్స్ చెప్పింది. ఆయా భాష‌ల్లో స్టార్ హీరోల‌తో న‌టించిన ఈ ముద్దు గుమ్మ‌.. ప్ర‌స్తుతం గోపీచంద్ తో క‌లిసి సీటీమార్ చిత్రంలో న‌టిస్తోంది. తాజాగా ఈ భామ ముంబైలోని జుహూలో షాపింగ్ కు వెళ్లింది. షార్ట్ యెల్లో డ్రెస్ లో ఉన్న త‌మ‌న్నా మాస్క్ పెట్టుకుని షాపింగ్‌మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా చేతుల‌ను శానిటైజ్ చేసుకున్న త‌ర్వాత షాపింగ్ పూర్తి చేసింది.

మిల్కీ బ్యూటీ ఇలా ముంబై వీధుల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌గా..పొట్టి డ్రెస్ లో ఉన్న త‌మ‌న్నాను అక్క‌డే ఉన్నవారు త‌మ కెమెరాల్లో బంధించారు. త‌మ‌న్నా షాపింగ్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. త‌మ‌న్నా క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.