ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 20, 2020 , 14:59:52

రూ.1.5 కోట్లు పారితోషికం..అందుకే గ్రీన్‌సిగ్న‌ల్‌..!

రూ.1.5 కోట్లు పారితోషికం..అందుకే గ్రీన్‌సిగ్న‌ల్‌..!

హిందీలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ గా నిలి‌చిన అంధాధున్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, న‌భాన‌టేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ట‌బు పోషించిన పాత్ర‌లో త‌మన్నా క‌నిపించ‌నుండ‌గా..రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌లో న‌భాన‌టేశ్ న‌టించ‌నుంది. ఈ చిత్రంలోని టబు పాత్ర కోసం నితిన్ తండ్రి..ప‌లువురి హీరోయిన్లను సంప్ర‌దించినా ఫ‌లితం లేక‌పోయింది. ఇక ఫైన‌ల్ గా చాలా కీల‌కంగా ఉండే ఈ పాత్ర‌కు ఫైన‌ల్ గా త‌మ‌న్నా సంత‌కం చేసింది.

ఇప్ప‌టికే స‌త్య‌దేవ్ తో ఓ సినిమాతోపాటు ప్ర‌వీణ్ స‌త్తారుతో క‌లిసి వెబ్ సిరీస్ కూడా చేస్తోన్న త‌మ‌న్నా..అంధాధున్ రీమేక్ లో న‌టించ‌డం పారితోషికం వల్లే అయి ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. త‌మ‌న్నా పాత్ర కోసం నిర్మాత ఏకంగా రూ.1.5 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇస్తాన‌ని చెప్పాడ‌ట‌. త‌మ‌న్నా కెరీర్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ మొత్తం ఎక్కువేనంటున్నారు ప‌లువురు సినీ విశ్లేష‌కులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.