మంగళవారం 09 మార్చి 2021
Cinema - Jan 03, 2021 , 21:56:41

తేజ సినిమా..కాజ‌ల్ అవుట్‌..తాప్సీ ఇన్..!

తేజ సినిమా..కాజ‌ల్ అవుట్‌..తాప్సీ ఇన్..!

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంలో టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజది ప్ర‌త్యేక‌మైన శైలి. ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ అనే చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుంద‌ని మొద‌ట ఫిక్స్ అయ్యాడు తేజ‌. అయితే ఇపుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కాజ‌ల్ స్థానంలో తాప్సీని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హిళాప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ తెచ్చుకుంది తాప్సీ. ఈ ప్రాజెక్టుకు తాప్సీ అయితే బాగుంటుంద‌ని తేజ్ అనుకుంటున్నాడ‌ట‌.

తేజ ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉండ‌గా..రానున్న రెండు నెల‌ల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. మ‌రోవైపు తాప్సీ కూడా స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ పూర్త‌వ‌గానే తేజ సినిమాతో జాయిన్ అయే అవ‌కాశాలున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి

ప్రభాస్ టు పవన్..ఈ హీరోలంతా హిట్ కొట్టాల్సిందే..!

ముంబైలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..టాలీవుడ్ న‌టి అరెస్ట్‌

న‌య‌న‌తార పెండ్లికి ముహూర్తం ఫిక్స్..?

మాల్దీవుల్లో కైరా అద్వానీ‌..పుకార్ల‌కు చెక్‌..!

సంచలన దర్శకుడితో రామ్ చరణ్ సినిమా..!

నేను బ‌య‌ట క్లాస్‌..లోప‌ల మాస్‌: న‌భాన‌టేశ్

ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కు జాన్వీక‌పూర్ సైన్ చేస్తుందా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo