శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 18:08:20

న‌ర్త‌న‌శాల‌లో 'ద్రౌప‌ది' గా సౌంద‌ర్య ఫ‌స్ట్ లుక్

న‌ర్త‌న‌శాల‌లో  'ద్రౌప‌ది' గా సౌంద‌ర్య ఫ‌స్ట్ లుక్

టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ న‌ర్తన‌శాల రీమేక్ వీడియోను అక్టోబ‌ర్ 24న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. న‌ర్త‌న‌శాలలో బాల‌కృష్ణ కీచ‌కుడు, అర్జునుడిగా రెండు పాత్ర‌ల్లో న‌టించ‌గా..సౌంద‌ర్య ద్రౌప‌ది పాత్ర‌లో న‌టించింది. ఇప్ప‌టికే బాల‌కృష్ణ పాత్ర పోస్ట‌ర్ విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

తాజాగా న‌ర్త‌న‌శాల నుంచి ద్రౌప‌ది లుక్ విడుద‌లైంది. ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య లీన‌మైపోయి న‌టించింద‌ని ఫ‌స్ట్ లుక్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. సుమారు 17 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను శ్రేయాస్ ఈటీ యాప్ లో అక్టోబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్నారు. న‌ర్త‌న‌శాల‌లో బాల‌కృష్ణ‌, సౌంద‌ర్య‌తోపాటు శ్రీహ‌రి, శ‌ర‌త్‌కుమార్‌, ఉద‌య్ కిర‌ణ్, ఆశిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సౌంద‌ర్య హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో అకాల మ‌ర‌ణం చెంద‌డంతో న‌ర్త‌న‌శాల ప్రాజెక్టును నిలిపివేసిన‌ట్టు బాల‌కృష్ణ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.