మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 17:54:26

జిమ్‌లో చెమ‌టోడుస్తున్న స్నేహ..వీడియో వైర‌ల్

జిమ్‌లో చెమ‌టోడుస్తున్న స్నేహ..వీడియో వైర‌ల్

చెన్నై: లాక్ డౌన్ కాలాన్ని చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ ఫిట్ నెస్ ను పెంపొందించుకునేందుకు వినియోగించుకుంటున్నారు. చాలా మంది యాక్ట‌ర్లు యోగ‌స‌నాలు వేస్తూ, జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ ఫిట్ నెస్ మంత్ర‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో అల‌నాటి అందాల తార స్నేహ చేరింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రెండో చిన్నారికి జ‌న్మ‌నిచ్చిన స్నేహ..ఇపుడు జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ స్లిమ్ మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇంట్లోని జిమ్ లో స్నేహ ఎక్స‌ర్‌సైజ్ చేస్తుంటే..చుట్టూ ఇద్ద‌రు పిల్ల‌లు ఆడుకుంటున్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకు వ‌ర్క‌వుట్స్  ప్రారంభించాను. మ‌న‌మంతా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్నాం. భ‌విష్య‌త్ కోసం.. మ‌నల్ని మ‌నం ఆరోగ్యంగా ఉంచుకుని పాజిటివ్ గా ఉందామ‌ని క్యాప్ష‌న్ ఇచ్చింది స్నేహ‌. 2012లో స్నేహ‌-ప్ర‌సన్న పెండ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo