ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 19:24:21

శృతిహాసన్ టాటూస్‌ రహస్యాలు !

శృతిహాసన్ టాటూస్‌ రహస్యాలు !

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఒంటిపై టాటూస్‌ ఫ్యాషన్‌గా మారిపోయాయి. ముఖ్యంగా సెలబ్రిటిలు తమ బాడీపై డిఫరెంట్‌ డిఫరెంట్‌ ప్లేస్‌ల్లో టాటూస్‌ వేయించుకుంటారు. అందున కథానాయికలు ముందు వరుసలో వుంటారు. అంతేకాదు వాళ్ల టాటూస్‌కు అర్థాలు కూడా వుంటాయి.ఇక శరీరంపై టాటూస్‌ విషయంలో ముందుడే కథానాయిక శృతిహాసన్‌. మొదట్నుంచీ టాటూస్‌ విషయంలో ఎంతో శ్రద్ధ చూపెట్టే శృతిహాసన్‌ ఇటీవల జరిగిన ఫ్యాన్స్‌ ఇంట్రాక్షన్‌లో తన టాటూ రహస్యాలు అభిమానులతో పంచుకుంది.

మెడమీద వున్న టాటూ మ్యూజికల్‌ సింబల్‌ను, వీపు వెనుక భాగంలో తన పేరును, చేతి మణికట్టుతో పాటు నడుం కింది భాగంతో పాటు కాళ్ల పాదాల దగ్గర గులాబీ పువ్వు చిహ్నాలను టాటూస్‌గా వుంటాయని తెలిపింది. ప్రస్తుతం ఈ అందాలభామ రవితేజతో ‘క్రాక్‌’, పవన్‌కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో నటిస్తోంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo