బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 15:39:12

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ!

టాలీవుడ్ అందాల భామ శృతిహాస‌న్ తాను ప్రేమ‌లో ఉన్న‌ట్టు ఇటీవ‌లే ఫ్యాన్స్ తో చేసిన చిట్‌చాట్‌లో బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.  మీరు ప్రేమ‌లో ఉన్నారా...? అని ఓ అభిమాని శృతిని అడుగ‌గా..నిజం..నేను ఊహించా అంటూ రిప్లై ఇచ్చింది. అభిమానుల ఊహ‌లు, అనుమానాలకు తెర‌దించుతూ అవును నేను మ‌ళ్లీ ప్రేమ‌లో ఉన్నాన‌ని తెలియ‌జేసింది శృతిహాస‌న్. ఈ స‌మాధానంతో ఇంత‌కీ శృతిహాస‌న్ ల‌వ్ లో ప‌డ్డ ఆ అబ్బాయి ఎవ‌రై ఉంటారా..? అంటూ ఆమె ఫాలోవ‌ర్లు, అభిమానుల‌కు చెవులు కొరుక్కున్నారు. 

తాజాగా దీనిపై సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు చూస్తే క్లారిటీ వ‌స్తుంది. ఇవాళ శృతిహాస‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ డూడుల్ ఆర్టిస్ట్‌ సాంత‌ను హ‌జారికా ఓ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఇతడు ముంబైలో శృతిహాసన్ తో ప్రీ బ‌ర్త్ డే లంచ్ డేట్ కు వెళ్లాడు. శృతికి విషెస్ చెప్పి హ‌గ్ చేసుకున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు సాంత‌ను హ‌జారికా.

ఈ క‌పుల్స్ ఇటీవ‌లే హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో కూడా క‌నిపించ‌డంతో శృతి మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డింద‌న‌ట్టు నెటిజ‌న్లు కామెంట్లు పెట్ట‌డం మొద‌లుపెట్టారు. శృతి-హ‌జారికా క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కొన్ని ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo