శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 19:13:30

గ్లామ‌ర‌స్ లుక్ లో శృతిహాస‌న్

గ్లామ‌ర‌స్ లుక్ లో శృతిహాస‌న్

లాక్ డౌన్ తో విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ భామ శృతిహాస‌న్ ఇటీవ‌లే మ‌ళ్లీ వ‌ర్క్ లో జాయిన్ అయిన విష‌యం తెలిసిందే. తెలుగులో ప‌లు ప్రాజెక్టులు చేస్తున్న శృతిహాస‌న్ ఇపుడు గ్లామ‌ర‌స్ లుక్ లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తోంది. కొన్నాళ్ల క్రితం చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పి..షూటింగ్స్ చేసుకుంటూ బిజీగా మారిపోయింది. తాజాగా  సైజ్ జోరో లుక్ లో మునుప‌టిలా క‌నిపిస్తూ..ఫొటోషూట్ లో పాల్గొంది. తెలుగులో ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ సినిమా చేస్తోంది. మ‌రోవైపు వ‌కీల్‌సాబ్ లో న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం మూవీ మేకింగ్ లో మార్పులు రావ‌డం, డిజిట‌ల్ ప్లాట్ ఫాంల హ‌వా న‌డుస్తుండ‌టంతో త‌న లుక్ ను కూడా కాంపిటీష‌న్ కు త‌గ్గ‌ట్టుగా మార్చుకుంటోంది. కెరీర్ తొలినాళ్ల‌లో క‌నిపించిన‌ట్టుగా శృతిహాస‌న్ గ్రీన్ డ్రెస్ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.