శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 18:56:14

శృతిహాస‌న్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

శృతిహాస‌న్ మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

క్రాక్ సినిమా స‌క్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది అందాల సొగ‌స‌రి శృతిహాస‌న్‌. క్రాక్‌లో శృతిహాస‌న్ యాక్టింగ్ ను అంద‌రూ ఫిదా అవుతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ సుంద‌రి ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చాట్ చేసింది. త‌న ప్రేమ జీవితం గురించి ఓపెన్ అయిపోయింది శృతిహాస‌న్. మీరు ప్రేమ‌లో ఉన్నారా...? అని ఓ అభిమాని అడుగ‌గా..నిజం..నేను ఊహించా అంటూ రిప్లై ఇచ్చింది. ఫ్యాన్స్ శృతిని ల‌వ్ లైఫ్ తోపాటు ప‌లు క్రేజీ ప్ర‌శ్న‌లు అడిగారు.

అభిమానుల ఊహ‌లు, అనుమానాలకు తెర‌దించుతూ అవును నేను మ‌ళ్లీ ప్రేమ‌లో ఉన్నాన‌ని తెలియ‌జేసింది శృతిహాస‌న్. మాజీ ప్రియుడు మైఖేల్ కోర్సలే అంటే ఇష్టం లేదా..?అని ఓ అభిమాని అడిగితే..శృతిహాస‌న్ న‌వ్వుతూ..మీరు అంటున్న‌ది నిజం కాదంటూ బ‌దులిచ్చింది. ఇటాలియ‌న్ మ్యూజిషియ‌న్ మైఖేల్ కోర్స‌లేతో కొన్నాళ్లు రిలేష‌న్‌షిప్ లో ఉన్న శృతిహాస‌న్..అత‌న్ని క‌మ‌ల్‌హాస‌న్ కు ప‌రిచ‌యం కూడా చేసింది. అయితే ఆ త‌ర్వాత మైఖేల్‌కు బ్రేక‌ప్ చెప్పింది శృతి. మ‌ళ్లీ ప్రేమ‌లో ఉన్నాన‌ని చెప్పిన శృతిహాస‌న్ మ‌రి ఎవ‌రిని ప్రేమిస్తుందోనంటూ తెగ చ‌ర్చించుకుంటున్నారు సినీ జ‌నాలు.

ఇవి కూడా చ‌ద‌వండి..

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo