పవన్ కోసం శృతిహాసన్ వ‌చ్చేస్తుంద‌ట‌..!

Nov 25, 2020 , 21:02:43

తెలుగు ఇండస్ట్రీలో రెండు భారీ సినిమాలతో శృతి హాసన్ రీ ఎంట్రీ ఇస్తుంది. మూడేళ్ల కింద పవన్ కళ్యాణ్ నటించిన `కాటమరాయుడు` తర్వాత మరో సినిమాలో నటించలేదు ఈ ముద్దుగుమ్మ. అప్పట్నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఈ భామ. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఒకేసారి రెండు సినిమాలతో వస్తుంది ఈ బ్యూటీ. ఆ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే కావడంతో అమ్మడికి రీ ఎంట్రీపై బాగానే నమ్మకాలున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ సినిమాలోనూ నటిస్తుంది శృతి. 

ఇప్పటికే ఈ జోడీ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో కలిసి నటించారు. అందులో గబ్బర్ సింగ్ రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాటమరాయుడు మాత్రం అంచనాలు అందుకోలేదు. డిజాస్టర్ అయిపోయింది ఈ సినిమా. ఇప్పుడు మరోసారి వకీల్ సాబ్ కోసం జోడీ కట్టబోతున్నారు ఈ ఇద్దరూ. ఇప్పటికే చాలా వరకు వకీల్ సాబ్ షూటింగ్ పూర్తైపోయింది. పవన్ కూడా జాయిన్ అయ్యాడు. త్వరలోనే శృతి కూడా వచ్చేస్తానని అనౌన్స్ చేసింది. 

పవన్ తో మూడుసార్లు నటించడం చాలా బాగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది ఈమె. ఆ సినిమాతో పాటు రవితేజ క్రాక్ లోనూ ఈమె హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ లో కూడా త్వరలో పాల్గొంటానని చెప్తుంది శృతి హాసన్. ఈ రెండు సినిమాలతో మళ్లీ తెలుగులో బిజీ అవుతానని ధీమాగా చెప్తుంది ఈ బ్యూటీ. జనవరి నుంచి వకీల్ సాబ్ కోసం వస్తానంటుంది ఈమె. దాంతో పాటు క్రాక్ డిసెంబర్ లోనే పూర్తి చేయనుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD