గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 15:34:19

పెళ్లి లేదు..పాలిటిక్స్ లేవంటున్న స్టార్ హీరోయిన్‌

పెళ్లి లేదు..పాలిటిక్స్ లేవంటున్న స్టార్ హీరోయిన్‌

లాక్ డౌన్ త‌ర్వాత సినిమా షూటింగ్స్ ఒక్కొక్క‌టిగా షురూ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అందాల భామ శృతిహాస‌న్ ఇప్ప‌టికే షూట్ లో పాల్గొంటుంది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోన్న క్రాక్ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో కొన‌సాగుతుంది. దీంతోపాటు వ‌కీల్‌సాబ్‌, లాభం సినిమాల్లో కూడా న‌ట‌స్తోంది. ఈ బ్యూటీ తాజాగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇంట‌ర్వ్యూలో వృతిప‌ర‌మైన‌, వ్య‌క్తిగ‌త అంశాలపై మాట్లాడింది. 

తాను కొన్నాళ్లు పెళ్లి ప్ర‌స్తావ‌నకు దూరంగా ఉంటాన‌ని చెప్పింది. తండ్రి క‌మ‌ల్ హాస‌న్ పెట్టిన పార్టీలో ఏమైనా చేర‌తారా..? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ..తన‌కు రాజ‌కీయాల గురించి అంత‌గా తెలియ‌దని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం తండ్రి పార్టీ కోసం ప్ర‌చారం కూడా చేయ‌లేనని న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చింది శృతిహాస‌న్‌.