శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 15:36:21

షార్ట్ ఫిలిం కోసం హైద‌రాబాద్ కు శృతిహాస‌న్‌..!

షార్ట్ ఫిలిం కోసం హైద‌రాబాద్ కు శృతిహాస‌న్‌..!

కొంత‌కాలంగా సింగింగ్ పై ఫోక‌స్ పెట్టిన శృతిహాస‌న్ రెండేళ్ల నుంచి ఎలాంటి సినిమాలు ఒకే చేయ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే శృతిహాస‌న్  ప్ర‌స్తుతం మ‌ళ్లీ తిరిగి యాక్టింగ్ కెరీర్ పై దృష్టిసారించి.. రెండు తెలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాలు అక్టోబ‌ర్ త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నాయి. గత కొన్నాళ్లుగా ముంబైలోని నివాసంలో ఉన్న శృతిహాస‌న్ రీసెంట్ గా హైద‌రాబాద్ లో ల్యాండయింద‌ట‌. 

మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తీస్తున్న షార్ట్ ఫిలిం కోసం శృతి హైద‌రాబాద్ కు వ‌చ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ భామ ముందుగా ర‌వితేజతో క‌లిసి న‌టిస్తోన్న క్రాక్ మూవీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్న పోర్ష‌న్ ను పూర్తిచేయ‌నుంది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తెర‌కెక్కిస్తున్న వ‌కీల్‌సాబ్ షూట్‌లో జాయిన్‌కానుంది.ఇప్ప‌టికైతే ఈ రెండు చిత్రాల‌పైన త‌న దృష్టి పెడుతున్న‌ట్టు చెప్పింది శృతిహాస‌న్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.