గురువారం 28 మే 2020
Cinema - Apr 28, 2020 , 12:57:16

నటి శ్రియా యోగా వీడియో వైరల్‌

నటి శ్రియా యోగా వీడియో వైరల్‌

ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన న‌టీ శ్రియా శ‌ర‌న్ ప్ర‌స్తుతం భ‌ర్త ఆండ్రీతో క‌లిసి స్పెయిన్‌లో నివ‌శిస్తున్న‌ది. ఇటీవ‌ల భ‌ర్త‌కు కొవిడ్‌-19 ల‌క్ష‌ణాలు రావ‌డంతో డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించారు. పాజిటివ్ రాక‌పోవ‌డంతో ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దీంతో వీరు ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఇంట్లోనే ఉంటూ రోజుకో వీడియోతో అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రియా ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ యోగా చేస్తున్న వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

సాధార‌ణంగా శ్రియా ఆరోగ్యం, ఫిట్నెస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటుంది. వ‌ర్కౌట్స్‌, యోగాకు ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతుంది. తన అందానికి సీక్రెట్ కూడా అదే అంటుంది శ్రియా. లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా యోగా ట్రైన‌ర్ సాయంతో శ్రియా యోగా చేయ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. శ్రీయా యోగా  వీడియో మీకోసం
logo