శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 14:42:24

రింగ్ లైట్ తో శ్ర‌ద్ధాదాస్..ఫొటోలు వైర‌ల్

రింగ్ లైట్ తో శ్ర‌ద్ధాదాస్..ఫొటోలు వైర‌ల్

తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది గ్లామ‌ర్ డాళ్ శ్ర‌ద్ధాదాస్. సిద్దు ఫ్ర‌మ్ శ్రీకాకుళం చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామకు కొన్ని చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉండే శ్ర‌ద్దాదాస్ తాజాగా డిజిటెక్ రింగ్ లైట్ ఫొటోషూట్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌ర్లు, ఆర్టిస్టుల‌కు, కంటెంట్ క్రియేట‌ర్ల‌కు డిజిటెక్ రింగ్ లైట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శ్ర‌ద్దాదాస్ ట్వీట్ చేసింది.

ఢిఫ‌రెంట్ క‌ల‌ర్ వేరియేష‌న్స్ లో, మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా బ్రైట్ నెస్ ను మార్చుకునే సదుపాయం ఇందులో ఉంద‌ని తెలిపింది శ్ర‌ద్దాదాస్‌. రింగ్ లైట్ మ‌ధ్య‌లో సెల్ ఫోన్ పెట్టుకునే సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉంది. రింగ్ లైట్ ను ఆవ‌శ్య‌క‌త‌ను తెలుపుతూ శ్ర‌ద్దాదాస్ దిగిన ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.