శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 12:59:36

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

టాలీవుడ్ న‌టుడు అక్కినేని అఖిల్ కు ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. ప్ర‌స్తుతం త‌న ఆశ‌ల‌న్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంపైనే పెట్టుకున్నాడీ ఈ యంగ్ హీరో. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. అఖిల్ కోసం  అత‌ని వ‌దిన టాలీవుడ్ న‌టి స‌మంత ఓ క్రేజీ ప్రాజెక్టును సెట్ చేసి పెట్టింద‌ట‌. స‌మంతతో క‌లిసి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ చేసిన‌ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా ఈ  చిత్రాన్ని చేయ‌నున్నారు.

అంతేకాదు ఈ ప్రాజెక్టులో స‌మంత ఓ కీల‌క పాత్ర‌లో కూడా న‌టిస్తుంద‌ట‌. రాజ్‌-కృష్ణ డీకే స‌మంత‌కు ఓ క‌థ వినిపించ‌గా..ఈ ప్రాజెక్టుకు అఖిల్ పేరును సూచించిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. ఈ మూవీని అశ్వినిద‌త్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది టాలీవుడ్ బ్యూటీ అక్కినేని స‌మంత‌.

ఇవి కూడా చ‌ద‌వండి

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo