శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 18:06:59

హ్యాపీ మూడ్ తో ముంబై టు హైద‌రాబాద్

హ్యాపీ మూడ్ తో ముంబై టు హైద‌రాబాద్

టాలీవుడ్ బ్యూటీ స‌మంత అక్కినేని ఇటీవ‌లే ఓ యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. త‌న టీంతో క‌లిసి సెల్పీని ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంది. యాడ్ షూట్ అయిపోగానే వైట్ టాప్‌, బ్లాక్ ప్యాంట్ డ్రెస్ వేసుకున్న సామ్‌..లొకేష‌న్ లో నుంచి డిజైనింగ్ బ్యాగు ప‌ట్టుకుని వ‌స్తోన్న దృశ్యాల‌ను ఫొటో జ‌ర్న‌లిస్ట్ మాన‌వ్ మంగ్లానీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  యాడ్ షూటింగ్ పూర్తి చేసుకుని హ్యాపీ మూడ్ తో విమానంలో హైద‌రాబాద్ కు వ‌చ్చేసింది.

యాడ్ పూర్తి చేసుకుని తిరిగొస్తున్న స‌మ‌యంలో స‌మంత మాస్క్ పెట్టుకుని త‌న స్టైలిష్ట్, ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి సెల్ఫీ దిగింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.