బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 22:35:00

స‌మంత చివ‌ర‌గా ఎప్పుడు ఏడ్చిందంటే..!

స‌మంత చివ‌ర‌గా ఎప్పుడు ఏడ్చిందంటే..!

టాలీవుడ్ బ్యూటీ స‌మంత లాక్ డౌన్ టైంలో సినిమాలేవి లేక‌పోవ‌డంతో ఇంటి వ‌ద్దే ఉంటూ త‌న ఫాలోవ‌ర్ల‌కు చాలా ర‌కాల టిప్స్ చెప్పుకుంటూ వ‌చ్చింది. ఇంటి గార్డెనింగ్‌, వంట చేయ‌డం, కూర‌గాయలు, పండ్ల‌ను స్వ‌యంగా పండించ‌డం, వాటికి కావాల్సిన ఎరువుల‌ను కూడా సొంతంగా త‌యార‌చేసి ఆ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ బ్యూటీ ఇవాళ ఆస్క్ మీ సెష‌న్ లో పాల్గొంది.

నెటిజ‌న్లు కొన్ని ప్ర‌శ్న‌లు వేయ‌గా స‌మంత  వాటికి జ‌వాబిచ్చింది. ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటార‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ధ్యానం చేయ‌డంతో మానసిక ఒత్తిడిని త‌గ్గించుకున్నాన‌ని చెప్పింది. మీరు చివ‌రిసారిగా ఎప్పుడు ఏడ్చారని అడిగితే..ఈ ప్ర‌శ్న అడిగినందుకు సంతోషంగా ఉంది. ఈ మ‌ధ్య ఇంట్లో వారికి ద‌ద్దుర్లు అయితే వాటిని చూసి ఏడ‌వ‌డం మొద‌లుపెట్టానని చెప్పింది. వీకెండ్ లో రైతుల‌తో క‌లిసి వ్య‌వ‌సాయం చేయాల‌ని అర్చ‌న అనే నెటిజ‌న్ సూచించ‌గా..ధ‌న్య‌వాదాలు మీ ఆలోచ‌న బాగుంది. ఈ విష‌యం గురించి నేను త‌ప్ప‌కుండా ఆలోచిస్తానని బదులిచ్చింది.

ఈ ఏడాది పూర్త‌యేలోపు ఏం చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ని అడిగితే..ఏం ప్లాన్ చేసుకోకుండా ఉండ‌ట‌మే మంచి ప్లాన్ అని త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చింది అక్కినేని వారి కోడ‌లు. ఈ బ్యూటీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో సామ్ క‌నిపించ‌నుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo