e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ర‌ష్మిక బాట‌లో స‌మంత‌..ఇంత‌కీ ఏ విష‌యంలో..!

ర‌ష్మిక బాట‌లో స‌మంత‌..ఇంత‌కీ ఏ విష‌యంలో..!

హీరోయిన్లు స‌క్సెస్ రూట్ లో ప‌డ‌గానే త‌మకంటూ సొంతంగా ఓ ఇల్లు చూసుకోవ‌డం సాధార‌ణ‌మే. కానీ ఒక్క ప్రాంతానికే ప‌రిమితం కాకుండా వివిధ భాష‌ల్లో సినిమాలు చేసే హీరోయిన్లు మాత్రం కొంత‌మందే ఉంటారు. అందులో చాలా మంది ప్రొఫెష‌న‌ల్ గా సినిమా షెడ్యూల్స్ కు అనుగుణంగా ఉండేలా ఆయా ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. తెలుగు, త‌మిళంతో, హిందీలోనూ త‌న స‌త్తా చాటాల‌నుకుంటున్న క‌న్న‌డ భామ ర‌ష్మిక ఇటీవ‌లే ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇపుడు ర‌ష్మిక రూట్‌లో స‌మంత కూడా వెళ్లాల‌నుకుంటుంద‌ట‌. ముంబైలో ఓ ఫ్లాట్ తీసుకోవాల‌ని ప్లాన్ చేసుకుంటుంద‌ట సామ్‌. ముంబై చాలా ఖ‌రీదైన న‌గ‌రం, డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కావాల‌న్నా..చాలా డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల స‌క్సెస్ తో బిజీగా ఉన్న స‌మంత ఫ్లాట్ కోసం పెద్ద మొత్తాన్ని పెట్టేందుకు రెడీ అవుతుంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌. మ‌రోవైపు రాంచ‌ర‌ణ్, ఉపాస‌న కూడా ముంబైలో బంగ్లాను కొనుగోలు చేశార‌న్న న్యూస్..హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

శ్రియా శరణ్ క‌థ‌క్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో

భర్తతో పబ్లిక్ రొమాన్స్‌..శ్రియ‌పై నెటిజ‌న్ల‌ సెటైర్లు

పాపుల‌ర్ బ్రాండ్ తో ‘అందాల రాక్ష‌సి’ డీల్‌

విడుద‌ల‌కు ముందే ఖ‌ర్చులు వ‌చ్చేశాయి..!

చీర‌లో ఆదాశ‌ర్మ మార్ష‌ల్ ఆర్ట్స్..వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana