టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) చేస్తున్న విషయంతెలిసిందే. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మైథలాజికల్ మ్యాగ్నమ్ ఓపస్ గా రాబోతున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. తాజాగా ఈ భామకు సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సామ్ మరో మహిళా ప్రధాన ఇతివృత్తంతో కూడిన చిత్రానికి పచ్చ జెండా ఊపినట్టు టాక్ నడుస్తోంది.
నానితో జెంటిల్ మెన్, సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమాలు చేసిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఇటీవలే ఓ కొత్త దర్శకుడు రాసిన కథతో సమంతను సంప్రదించగా…సమంతకు కూడా ఆయన చెప్పిన కథ నచ్చిందట. అంతేకాదు సమంత నవంబర్ నుంచి డేట్స్ కూడా సర్దుబాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఒక్కటే పెండింగ్ లో ఉందని, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా ఇటీవలే సమంత ముంబైకు మకాం మార్చి, రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి శివలెంక కృష్ణప్రసాద్ సమంతతో కలిసి ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్