గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 12, 2021 , 17:02:37

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీకి సాయిప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌..!

ప‌వ‌న్ క‌ల్యాణ్-రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా లాంఛ్ అయింది. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ చేసేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి‌ని వ‌న్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ పొజిష‌న్ లో తీసుకునేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తుండ‌గా..సాయిప‌ల్ల‌వి నో చెప్పిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా ఇదే న్యూస్ మ‌రోసారి లైమ్‌లైట్ లోకి వచ్చింది. సాయిప‌ల్ల‌వికి ఈ చిత్రానికి ప‌చ్చ జెండా ఊపింద‌ని ఫిలింన‌గ‌ర్ లో అప్ డేట్ ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. రీమేక్ లో ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కంటే మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా పాత్ర‌ను  డిజైన్ చేయ‌డంతో సాయిప‌ల్ల‌వి ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌వి ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతుందన్న న్యూస్ పై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డం ఒక్క‌టే పెండింగ్ లో ఉన్న‌ట్టు స‌మాచారం.  మ‌రి ముందుగా వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం ఆన్ స్క్రీన్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య‌గా న‌టిస్తుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo