గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 19:21:18

చిరంజీవి సోద‌రి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి..?

చిరంజీవి సోద‌రి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త‌మిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన వేదాల‌మ్ రీమేక్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అజిత్ హీరోగా వ‌చ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద రికార్డుల‌ను సృష్టించింది. మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్ లో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు టాక్‌. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. తెలుగు, త‌మిళం, మ‌లయాళ భాష‌ల్లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది కోలీవుడ్ బ్యూట సాయిప‌ల్ల‌వి. ఈ అందాల భామ వేదాల‌మ్ తెలుగు రీమేక్ లో చిరంజీవి సోద‌రి పాత్ర‌లో కనిపించ‌నున్న‌ట్టు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో ఈ వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. సీరియ‌స్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రానున్న ఈ చిత్రంలోని పాత్ర కోసం సాయిప‌ల్ల‌వి అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ అప్ డేట్ లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందనే విష‌యంపై మ‌రికొన్ని రోజులు ఆగితే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే సాయిప‌ల్ల‌వి త‌క్కువ టైంలోనే మెగాస్టార్ తో క‌లిసి నటించే అరుదైన అవ‌కాశం కొట్టేసిన‌ట్టే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo