శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 15:44:42

సీఈవోగా రేణూ దేశాయ్..‘ఆధ్య’ టైటిల్‌..?

సీఈవోగా రేణూ దేశాయ్..‘ఆధ్య’ టైటిల్‌..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్ లో వ‌స్తున్న వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు ఆధ్య అనే టైటిల్ ను ఖ‌రారుచేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టులో రేణూ దేశాయ్ సీఈవో పాత్ర‌లో కనిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. డీఎస్ రావు-ఎస్ ర‌జ‌నీకాంత్ సంయుక్తంగా వెబ్ సిరీస్ ను తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణూదేశాయ్ కూతురు  పేరు ఆధ్య అనే సంగ‌తి తెలిసిందే. ఇదే పేరును టైటిల్ ను పెట్టిన‌ట్టు న్యూస్ వ‌స్తున్నా..దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ప‌వ‌న్ తో విడాకులు తీసుకున్న రేణూదేశాయ్ అకీరా, ఆధ్య‌తో క‌లిసి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం హైద‌రాబాద్ కు వ‌చ్చేసిన రేణూ దేశాయ్ త‌న ప్లాన్ ప్ర‌కారం రీఎంట్రీ ఇస్తోంది. వ‌చ్చే నెల‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ షురూ కానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.