ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 28, 2020 , 20:53:39

కెరీర్‌ను సంతృప్తికరంగా ముగించాలి: రెజీనా

కెరీర్‌ను సంతృప్తికరంగా ముగించాలి: రెజీనా

కథానాయికలకు అందం, అభినయంతో పాటు సినీ పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ మాటను చాలా మంది హీరోయిన్లు అంగీకరిస్తారు.అయితే కొంత మంది నాయికలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ జాబితాలోకి వస్తారు రెజీనా కసాండ్రా.. మీరు నటించిన సినిమాలు విజయాలు సాధిస్తున్న నాయికగా మీకు అదృష్టం కలిసి రావడం లేదు.. కెరీర్ పెద్దగా స్పీడందుకోలేదని ఆమెని ప్రశ్నిస్తే స్పీడు కార్లకు, బైక్‌లకు బాగుంటుంది. మనుషులకు స్పీడు ఉండకూడదు. కెరీర్‌లో, జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కడానికే ప్రయత్నించాలి. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అప్పుడే జీవితమంటే ఏమిటో తెలుసుకొనే అవకాశం దక్కుతుంది.  అదే నేను నమ్మిన సిద్ధాంతం.

సినిమా ఎంపికలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావని చాలా మంది నన్ను అడుగుతారు. కెరీర్ సంతృప్తికరంగా ముగించాలన్నదే నా కోరిక.  నా ఆత్మసంతృప్తి, సెల్ప్‌గ్రోత్‌ను  దృష్టిలో పెట్టుకునే  సినిమాల్ని అంగీకరిస్తాను. హడావుడిగా సినిమాలు చేసి వెళ్లిపోవాలని అనుకోవడం లేదుఅని చెప్పుకొచ్చింది ఈ అందాలభామ.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.