బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 15:23:41

కేక పుట్టిస్తున్న‌ ర‌ష్మిక‌-ధ్రువ్ ల 'క‌రాబు' వీడియో సాంగ్‌

కేక పుట్టిస్తున్న‌ ర‌ష్మిక‌-ధ్రువ్ ల 'క‌రాబు' వీడియో సాంగ్‌

క‌న్న‌డ స్టార్లు ర‌ష్మిక మంద‌న్నా, ధ్రువ సార్జా కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం పొగ‌రు. నంద‌కిశోర్ డైరెక్ట‌ర్. ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. 'అరే ఎవ‌ర్రా ఈ గులాబ్ జామూన్‌..ఏయ్ తెల్వ‌దా అన్న గ‌ర్ల్ ఫ్రెండ్ బే ..అనే సంభాష‌ణ‌ల‌తో షురూ అవుతూ.. క‌రాబూ అంటూ సాగే వీడియో సాంగ్ అంద‌రినీ అల‌రిస్తోంది. ధ్రువ సార్జా ఈ పాట‌లో ఊర మాస్ లుక్ లో క‌నిపిస్తూ..ర‌ష్మిక‌ను టీజ్ చేస్తుండ‌టం చూడొచ్చు. ధ్రువ త‌న డ్యాన్స్ తో అదర‌గొడుతున్నాడు.

ఈ చిత్రంలో సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్, ప‌విత్ర లోకేశ్‌, గిరిజా లోకేశ్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ చాంపియ‌న్స్ కై గ్రీనె, మోర్గాన్ ఆస్టే, జోయ్ లిండ‌ర్, జాన్ లుకాస్ కూడా ఈ మూవీలో న‌టిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo