మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 20:54:35

నిన్న లంగావోణిలో..నేడు చీర‌క‌ట్టులో

నిన్న లంగావోణిలో..నేడు చీర‌క‌ట్టులో

టాలీవుడ్ బ్యూటీ రాశీఖ‌న్నా సోష‌ల్ మీడియాలో సరికొత్త లుక్స్ తో ఇపుడు అంద‌రినీ అల‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ పంజాబీ ముద్దుగుమ్మ కొన్ని రోజులుగా వ‌రుస ఫొటోషూట్స్ తో సంద‌డి చేస్తోంది. ఇటీవ‌లే సంప్ర‌దాయ‌బ‌ద్దంగా లంగావోణిలో అందాల‌ను ఒల‌క‌బోస్తూ కెమెరాకు పోజులిచ్చిన స్టిల్స్ వైర‌ల్ గా మారాయి. తాజాగా సారీ లుక్ లో క‌నువిందు చేస్తోంది రాశీ. పూల డిజైన్ ఉన్న మెరూన్ క‌ల‌ర్ జాకెట్ , బంగారు వ‌ర్ణ‌పు చీర‌లో హొయ‌లు పోతూ త‌న అందంతో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల‌ను చేస్తోంది.

సినిమాలో స్టైలిష్ ట్రెండీ డ్రెస్సుల్లో క‌నిపించే ఈ సుంద‌రి..ఇపుడు స్వ‌చ్చ‌మైన గ్రామీణ వాతావ‌ర‌ణంలో క‌నిపించే యువ‌తిగా అంద‌రినీ ఆకర్షిస్తోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.