టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరు గత ఏడాది కరోనా టైంలోనే పెళ్లి పీటలెక్కేశారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ పెళ్లిపై పడింది. కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతన్నప్పటికీ, దానిపై పూర్తి క్లారిటీ అనేదే లేకుండా పోయింది.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2025 వరకు ప్రభాస్ పెళ్లి జరగడం కాస్త అనుమానంగానే కనిపిస్తుంది.
పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల కోసం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ రానున్న రోజులలో రాధే శ్యామ్, సలార్ చిత్ర షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. ఇవి పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చారిత్రాత్మక చిత్రం, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించనున్న ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్- దిల్ రాజు కాంబోలో రానున్న చిత్రాలు చేయనున్నాడు ప్రభాస్. ఇవన్నీ పూర్తయ్యే సరికి 2024 కూడా పూర్తవుతుంది.మరి ఇంత బిజీ షెడ్యూల్స్ మధ్య ప్రభాస్ పెళ్లి అనేది కలే అంటున్నారు నెటిజన్స్.