శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 17:08:47

'లైగ‌ర్'తో ర‌మ్య‌కృష్ణ..ట్రెండింగ్‌లో స్టిల్

'లైగ‌ర్'తో ర‌మ్య‌కృష్ణ..ట్రెండింగ్‌లో స్టిల్

బాహుబ‌లి సినిమాలో శివ‌గామిగా న‌టించి వ‌రల్డ్ వైడ్‌గా అభిమానుల‌ను సంపాదించుకుంది సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ‌. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం లైగర్. ఈ ప్రాజెక్టులో విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్‌లో కొన‌సాగుతుండ‌గా..ర‌మ్య‌కృష్ణ షూట్‌లో జాయిన్ అ అయింది. ర‌మ్య‌కృష్ణ‌తో క‌లిసి సెట్స్ లో చిరున‌వ్వులు చిందిస్తోన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

పాన్ ఇండియా క‌థాంశంతో  తెర‌కెక్క‌తున్న లైగ‌ర్ ‌లో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. తెలుగు, హిందీతోపాటు మ‌రో మూడు భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ మిక్స్ డ్ మార్ష‌ల్ ‌ఆర్టిస్ట్ గా క‌నిపించ‌నున్నాడు. పూరీ, ఛార్మీ కౌర్‌, క‌ర‌ణ్‌జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo