సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 16:44:05

50వ బ‌ర్త్ డే..కేక్ క‌ట్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌..!

50వ బ‌ర్త్ డే..కేక్ క‌ట్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌..!

ఫ్యామిలీ ఓరియెంటెడ్‌, మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకుంది అందాల న‌టి ర‌మ్య‌కృష్ణ‌. గ్లామ‌రోతో కూడిన పాత్ర‌లోనైనా, సీరియ‌స్ పాత్ర‌లోనైనా అవ‌లీల‌గా ఒదిగిపోగ‌ల న‌టి ర‌మ్య‌కృష్ణ‌. బాహుబ‌లి చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి శివ‌గామిగా వ‌ర‌ల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకుంది. ఈ సీనియ‌ర్ న‌టి నేడు 50వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుంది. ర‌మ్య‌కృష్ణ త‌న భ‌ర్త కృష్ణ‌వంశీ, పిల్ల‌లు ఇత‌ర కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంది. అద్బుత‌మైన 5 ప‌దుల వ‌యస్సు..అంటూ ఇన్ స్టాగ్రామ్ లో క్యాప్ష‌న్ ఇచ్చింది.

త‌మిళ‌నాడు సీఎం, న‌టి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన క్వీన్ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ లీడ్ రోల్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క్వీన్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తుంది. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్కింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo