శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 16:07:39

గ్రామీణ యువ‌తిగా ర‌కుల్ ప్రీత్ సింగ్..స్టిల్స్ వైర‌ల్

గ్రామీణ యువ‌తిగా ర‌కుల్ ప్రీత్ సింగ్..స్టిల్స్ వైర‌ల్

టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ‌ యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. వికారాబాద్ అడ‌వుల్లో షూటింగ్ కొన‌సాగుతుండ‌గా..లొకేష‌న్ లో ర‌కుల్ ప్ర‌త్యక్ష‌మైన స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లంగావోణిలో క‌నిపిస్తున్న ర‌కుల్ ఎరుపు రంగు క‌ల‌ర్ ష‌ర్టును వేసుకోవ‌డం ఫొటోలో గమ‌నించ‌వ‌చ్చు. తెలుగు న‌వ‌ల కొండ‌పొలం ఆధారంగా వ‌స్తున్న ఈ చిత్రంలో పేద కుటుంబానికి చెందిన యువ‌తిగా  ర‌కుల్ క‌నిపించ‌నుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయ‌నున్నాడు క్రిష్. 

మ‌రోవైపు ముంబై డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లో భాగంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ర‌కుల్ ప్రీత్ సింగ్ కు స‌మ‌న్లు జారీచేసి..త్వ‌ర‌లోనే విచారించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట‌ర్ క్రిష్ ఈ విష‌యంలో ర‌కుల్ కు మ‌ద్ద‌తుగా నిలిచి..షూటింగ్ కు హాజ‌ర‌యేలా చూస్తున్నారు. డ్ర‌గ్స్ తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని ర‌కుల్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo