గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 16:19:44

ర‌కుల్ ప్రీత్ సింగ్ "అర్థ‌ప‌ద్మాస‌‌నం" ఫొటో వైర‌ల్‌

ర‌కుల్ ప్రీత్ సింగ్

ఫిట్ నెస్ మంత్ర‌ను ఫాలో అయ్యే సెల‌బ్రిటీల‌ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా జిమ్ కు వెళ్లి వ‌ర్క‌వుట్స్ చేయ‌డం, యోగా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేలా టైం టేబుల్ ను ఫిక్స్ చేసుకుంటుంది ర‌కుల్‌. తాజాగా ఈ తార యోగాస‌నం వేసిన స్టిల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. హాఫ్ లోట‌స్ పోస్ (అర్థ ప‌ద్మాస‌న‌) స్థితిలో కూర్చొని ఆస‌నం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మ‌న‌స్సును నిశ్శ‌బ్ధంగా ఉంచండి..ఆత్మ మాట్లాడుతుంది. మెడిటేష‌న్ మిమ్మ‌ల్ని మీలోని అంత‌ర్గ‌త ప్ర‌పంచంతో క‌నెక్ట్ చేస్తుంది అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ర‌కుల్ యోగాస‌నం స్టిల్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

వ‌య‌స్సుపై బ‌డి మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు కూడా ఈ ఆస‌నం చేసే వీలుండ‌టంతో..ఎక్కువ‌మందికి అర్ద ప‌ద్మాస‌నం సిఫారసు చేస్తారు. హిప్, కండరాలు, కటి, కాళ్ళు, చీలమండలు ఆరోగ్య‌వంతంగా ఉండేందుకు అర్ద ప‌ద్మాస‌నం ఉపక‌రిస్తుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo