మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 17:29:15

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌..!

క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌..!

అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం త‌న సోదరుడితో క‌లిసి హైద‌రాబాద్ లో ఉంటోన్న విషయం తెలిసిందే. సినిమాల‌తో పాటు వ్యాపారరంగంలో కూడా బిజీగా మారిపోయింది. ర‌కుల్ సినిమాల విష‌యానికొస్తే..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-క్రిష్ కాంబినేష‌న్ లో రానున్న విరూపాక్ష చిత్రంలో నటించనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌కుల్ కొత్త సినిమాకు సంబంధించిన మ‌రో వార్త కూడా ఫిలింనగ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌స్తుతం ఒలింపిక్ విజేత, వెయిట్ లిఫ్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ తీసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో లీడ్ రోల్ కోసం హీరోయిన్ ను వెతికే ప‌నిలో ప‌డ్డారు కోన వెంక‌ట్‌. తొలుత ఈ పాత్ర కోసం తాప్సీని సంప్ర‌దించ‌గా..వేరే సినిమాల కార‌ణంగా తాప్సీ రెడీగా లేన‌ట్టు చెప్పింద‌ట‌. ఫిట్ నెస్ నైపుణ్యాలు క‌లిగిన న‌టి అయితే ఈ రోల్ కు బాగా సెట్ అవుతుంద‌ని భావించిన కోన వెంక‌ట్ ర‌‌కుల్ ప్రీత్ ను లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ర‌కుల్ కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo