గ్లామ‌ర‌స్ లుక్ లో ర‌కుల్..‌బ్యాక్ టు సెట్స్

Oct 29, 2020 , 15:04:49

టాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ర‌కుల్ ఇటీవ‌లే వికారాబాద్ అడ‌వుల్లో క్రిష్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నది. క్రిష్ వైష్ణ‌వ్ తేజ్ సినిమా కోసం డీగ్లామ‌రైజ్ డ్ రోల్ లో లంగావోణిలో క‌నిపించి సంద‌డి చేసింది. అయితే ఈ భామ తాజాగా సెట్స్ లో జాయిన్ అయింది. అయితే ఈ సారి ఫుల్ గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తోంది ర‌కుల్‌. యెల్లో నిట్టెడ్ స్వెట‌ర్ విత్ మినీ స్క‌ర్ట్ వేసుకున్న ఫొటోను షేర్ చేస్తూ..నెక్ట్స్ సీన్ షాట్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

క్యూట్ గా చ‌బ్బీచ‌బ్బీ లుక్ లో క‌నిపిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ స్టిల్ చూస్తుంటే ర‌కుల్ బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ తో చేస్తున్న సినిమా లొకేష‌న్ కు సంబంధించిన‌దిగా తెలుస్తోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD