శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 18:40:27

ప్రియమణి లీడ్ రోల్ లో ‘‘కొటేషన్ గ్యాంగ్’’

ప్రియమణి లీడ్ రోల్ లో ‘‘కొటేషన్ గ్యాంగ్’’

నేష‌న‌ల్ అవార్డు విన్నర్, న‌‌టి ప్రియమణి లీడ్ రోల్ లో న‌టిస్తోన్న‌ సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’. బాలా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వివేక్.కె ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీమన్నారాయణ, మిరపకాయ్,పైసా లాంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్, అక్షయ ఇతర నటీనటుల‌తోపాటు ఓ స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా  తెలుగు, తమిళ, తెలుగు,కన్నడ మరియు మలయాళ భాషల్లో తెర‌కెక్కిస్తున్నారు.  క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ మొత్తం ముంబై, తమిళనాడు,తెలుగు  రాష్ట్రాలలో జరుగబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు. తెలుగులో ఇప్ప‌టికే వెంక‌టేశ్ హీరోగా  నార‌ప్ప సినిమాలో న‌టిస్తోంది ప్రియ‌మ‌ణి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo