శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 14:55:28

సాయంకాలా‌న సాగ‌ర తీరాన ప్రణీత..వీడియో వైర‌ల్

సాయంకాలా‌న సాగ‌ర తీరాన ప్రణీత..వీడియో వైర‌ల్

టాలీవుడ్ భామ ప్ర‌ణీత ఇటీవ‌లే మాల్దీవుల్లో స‌ర‌దాగా విహ‌రించిన విష‌యం తెలిసిందే. మాల్దీవుల్లోని రిసార్ట్స్ లో సైకిల్ పై చ‌క్క‌ర్లు కొడుతూ..బీచ్ లో స్నేహితురాలితో క‌లియ తిరుగుతూ ఎంజాయ్ చేసిన ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లే సాగ‌రతీరంలో సాగ‌ర‌క‌న్య‌లా జ‌ళకాలాడింది. స‌ముద్రంలో ఈత కొడుతూ నీటిలోప‌ల దాగి ఉన్న స‌హ‌జ‌సిద్ద‌మైన అందాల‌ను చూసి ప‌ర‌వ‌శించిపోయింది. ఈ భామ స్విమ్ షూట్ లో సాగ‌రంలో డిప్ చేస్తూ అందాలు ఆర‌బోసింది.

ఓ వైపు స‌ముద్ర అందాలు, మ‌రోవైపు సాయంకాలం సాగ‌ర‌తీరంలో ప్ర‌ణీత సోయ‌గం క‌ల‌గ‌లిపిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా..వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌ణీత సుభాష్ ప్ర‌స్తుతం భుజ్‌..ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, హంగామా 2 చిత్రాల్లో న‌టిస్తోంది.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.